ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్‌లో ఇలాంటి ఛానళ్లపై చర్యలు కొనసాగుతాయని MAA స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఇటీవల ఓ యూట్యూబర్ హనుమంతు తండ్రీకూతుళ్లపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. అతని కామెంట్స్ తారాస్థాయికి చేరడంతో పలువురు సినీనటులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమంతుపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ఇటీవల సోషల్ మీడియాలో ట్రోలింగ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సామజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతూ ఇతరులను కించపరిచే విధంగా వీడియోలను పోస్ట్ చేస్తున్నారు ఆకతాయిలు. ఇక ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకునేందుకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) సిద్ధమైంది.
పలువురు నటులు, వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ విమర్శలు, ఫేక్ న్యూస్ పోస్ట్ చేస్తున్న ఐదు యూట్యూబ్ ఛానళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఫేక్ న్యూస్ పోస్ట్ చేస్తున్న ఐదు యూట్యూబ్ చానళ్లను రద్దు చేయించినట్లు MAA తెలిపింది.
ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్‌లో ఇలాంటి ఛానళ్లపై చర్యలు కొనసాగుతాయని MAA స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఇటీవల ఓ యూట్యూబర్ హనుమంతు తండ్రీకూతుళ్లపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. అతని కామెంట్స్ తారాస్థాయికి చేరడంతో పలువురు సినీనటులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమంతుపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు.
ఈ తరుణంలోనే నటులపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెడుతూ, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై MAA చర్యలు తీసుకొంటునట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జస్ట్ వాచ్ BBC, ట్రోల్ల్స్ రాజా, బాచిన లలిత్, హైదరాబాద్ కుర్రాడు, XYZఎడిట్స్007 అనే ఐదు యూట్యూబ్ చానళ్లను టర్మినేట్ చేసినట్లు MAA తెలిపింది.