అనంతరం సుహానా ఆర్డింగ్లీ కాలేజీలో తన హయ్యర్ స్టడీస్ చేసింది. న్యూయార్క్‌లోని ఆర్ట్స్ స్కూల్ నుండి నటనలో డిగ్రీ పొందారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బాలీవుడ్ బాద్ షా కూతురంటే ఆ మాత్రం ఉండాలి. తెలివి ఉంటే ఎలా ఇండస్ట్రీ లో ఎలా నెట్టుకురావచ్చో నిరూపించింది. తండ్రి తో సంబంధం లేకుండా ఆస్తులు కూడబెట్టుకుంటుంది. నిజానికి సుహానా ఖాన్ షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతులకు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ కూతురు. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. అనంతరం సుహానా ఆర్డింగ్లీ కాలేజీలో తన హయ్యర్ స్టడీస్ చేసింది. న్యూయార్క్‌లోని ఆర్ట్స్ స్కూల్ నుండి నటనలో డిగ్రీ పొందారు.
సుహానా ఇండస్ట్రీ ఎంట్రీ కంటే ముందే కొన్ని బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నారు. మెబిలిన్ , లక్స్ , ఇలా కొన్ని బ్యూటీ ప్రాడెక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. దీని వల్ల సంపాదించిన డబ్బును తండ్రిలాగా ..రియల్ ఎస్టేట్ మీద పెట్టారు.ముంబైలోని అలీబాగ్‌లోని తాల్ గ్రామంలో రూ. 12.91 కోట్లకు ఒక ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశారు. 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంట్లో 2,218 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు విల్లాలు ఉన్నాయి. అంతేకాదు తాల్ గ్రామంలోనే రూ.9.5 కోట్ల విలువైన మరో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్‌కు రూ. 70 లక్షల విలువైన ఆడి A6 కారును బహుమతిగా ఇచ్చారు.
2023లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన “ది ఆర్చీస్” చిత్రం ద్వారా సుహానా ఖాన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ తో పాటు " ది కింగ్ " అనే సినిమా చేస్తుంది. భారీబడ్జెట్ తో పాటు తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది సుహానా ఖాన్. సుహానా ఖాన్ కు కాస్ట్లీ బ్యాగులు కొనే అలవాటుంది. ఒక్కో హ్యాండ్ బ్యాగ్ కు 1.5 లక్షలు పెట్టి కొంటుంది. సంపాదిస్తుంది ...అంతకు మించి ఖర్చు పెడుతుంది.