ఆది దేవుడు మహాశివుడు అన్ని రాశులకు అధిపతి. శివుడు తన భక్తులను ఎప్పుడు కష్టాలనుంచి కాపాడతాడు శివుని కటాక్షం
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆది దేవుడు మహాశివుడు అన్ని రాశులకు అధిపతి. శివుడు తన భక్తులను ఎప్పుడు కష్టాలనుంచి కాపాడతాడు శివుని కటాక్షం ఉంటే అంతా శుభమే జరుగుతుందని భక్తుల విశ్వాసం. లయకారుడైన శివుడని భక్తులు విశేషంగా పూజిస్తారు. ఇక వచ్చేది శ్రావణమాసం శివుడికి ఇష్టమైన మాసం. శివుడి కటాక్షం ఎప్పుడూ ఉండే కొన్ని రాశుల వారు ఉన్నారు. వారికి శివుడు ఎప్పుడూ రక్షా కవచంగా నిలిచి అనుగ్రహిస్తూ ఉంటాడు.
* కర్కాటక రాశి : కర్కాటక రాశి వారిపై శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. కర్కాటక రాశికి అధిపతి శివుని నుదుటిపై ఉన్న చంద్రుడు కావడం వల్ల కర్కాటక రాశి వారిని ఎల్లప్పుడూ శివుడు వివిధ సంక్షోభాల నుంచి, సమస్యల నుంచి కాపాడుతూ ఉంటాడు. కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం శివయ్యకి పూజలు చేస్తే మరింత బాగుటుంది.
*తులా రాశికి: తులారాశి జాతకులు గొప్ప ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉంటారు. వీరిని శివుడు కాపాడుతూ ఉంటాడు. తులా రాశి జాతకులు మనోహరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు అభిరుచుల కోసం డబ్బు ఖర్చు చేయడానికి వెనకాడరు. వీరు ఎప్పుడు విలాసవంతంగా బతకాలని చూస్తారు. వీరికి ఎప్పుడు రక్షా కవచంగా శివుడు ఉంటాడట.
* మకర రాశి : వారిని శివుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. మకరరాశి పాలకగ్రహం శనిదేవుడు. శనిదేవుడు శివుడి యొక్క గొప్ప భక్తుడు. శివుడిని శనిదేవుడు గురువుగా భావిస్తాడు. మకరరాశి వారు కష్టపడి పని చేస్తారు.
* కుంభరాశిపై కూడా తన కటాక్షాన్ని చూపిస్తూ ఉంటాడు. కుంభ రాశి శని దేవునికి చాలా ప్రియమైన రాశి. ఈ రాశి వారినీ అకాల మరణం నుండి శివుడు కాపాడుతాడు.
శివకటాక్షం కలగాలన్నా...ఏ రాశి వారికైనా కష్టాలు పోవాలన్నా శివుని ఆరాధన గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి సోమవారం ..కాసిన్ని నీరు పోసి శంకుర్ని వేడుకొండి..అదే స్వామి వారికి అభిషేకం..స్వామి కటాక్షం అందుతుంది.