స్మితా పోస్ట్‌పై CSB IAS అకాడమీ చీఫ్ బాలలత ఘాటుగా స్పందించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. IAS అవ్వాలంటే అందగత్తెలు అవ్వాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. అంగవైకల్యం ఉన్నవారి గురించి ఆ రకంగా మాట్లాడడానికి స్మితాకు ఏ అర్హత ఉందని ప్రశ్నించారు. జ్యుడిషియరీ, పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు ఆమె వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. వైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్ నియమించుకుంటుందా? లేదా వైకల్యం ఉన్న సర్జన్‌ని నమ్ముతారా అని ఆమె ప్రశ్నించారు. AIS అనేది ఫీల్డ్ వర్క్, పన్నులు విధించడం, ప్రజల మనోవేదనలను నేరుగా వినడం వంటివి ఉంటాయని ఆమె తెలిపారు.
కాబట్టి ఈ ప్రీమియర్ సర్వీస్‌కు వికలాంగుల కోటా అవసరమా అని స్మితా ప్రశ్నించారు. అయితే, ఆమె అభిప్రాయం ఏదైనప్పటికీ వికలాంగులను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ పోస్ట్ ద్వారా స్మితా విమర్శల పాలైందనే చెప్పొచ్చు. ఇప్పటికే ఆమె చేసిన పోస్ట్‌పై పలువురు స్పందిస్తున్నారు.
తాజగా, స్మితా పోస్ట్‌పై CSB IAS అకాడమీ చీఫ్ బాలలత ఘాటుగా స్పందించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. IAS అవ్వాలంటే అందగత్తెలు అవ్వాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. అంగవైకల్యం ఉన్నవారి గురించి ఆ రకంగా మాట్లాడడానికి స్మితాకు ఏ అర్హత ఉందని ప్రశ్నించారు. జ్యుడిషియరీ, పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు ఆమె వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
ఏ ఫీల్డ్‌లో పరిగెత్తుతూ స్మితా సభర్వాల్ ఎంతకాలం పని చేసిందని ప్రశ్నించారు. స్మిత తన మాటలు వ్యక్తిగతంగా మాట్లాడుతుందా.. ప్రభుత్వం తరఫున మాట్లాడుతుందా అనేది తెల్చాలని బాల లత డిమాండ్ చేశారు. సివిల్స్ పరీక్ష రాస్తానని.. తన కన్నా ఎక్కువ మార్కులు సాధించాలని ఆమె స్మితాకు సవాల్ విసిరారు. స్టీఫిన్ హాకింగ్, సుదా చంద్రన్ వంటి మేధావులు అంగవైకల్యం జయించారని ఆమె గుర్తుచేశారు.
మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు CMOలో పనిచేసిన ఆమెకు.. కనీసం అడ్మినిస్ట్రేషన్ పైన అవగాహన లేకపోవడం బాధాకరమని ఆమె అన్నారు. స్మితాకు CS షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. స్మితా మాటలను 24 గంటల్లో వెనక్కి తీసుకోకపోతే ట్యాంక్ బండ్ వద్ద నిరసన దీక్ష చేపడతామని ఆమె హెచ్చరించారు.