కాకతీయ యూనివర్సిటీలోని రాణిరుద్రమదేవి హాస్టల్ గదిలో పైకప్పు ఊడిపోయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా శాఖ మంత్రి లేరు. వసతి గృహాల్లోని విద్యార్థుల రక్షణపై ప్రభుత్వానికి సైతం కనీస చిత్తశుద్ధి లేదని మండిపడుతున్నారు. పైకప్పు కూలి పడిపోయిన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ హాస్టల్‌లో పరిస్థితుల దయనీయంగా మారిపోయాయి. హాస్టల్‌లో ఉండే తమకు కనీస రక్షణ లేకుండా పోయిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ గదిలోని ఫ్యాన్ ఊడి పడిపోవడంతో ఓ విద్యార్థిని తలకు బలమైన గాయమైన విషయం తెలిసిందే. ఆ యువతిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. ఇప్పటికీ ఆమె తలపై గాయం పూర్తిగా తగ్గలేదు. ఈ అంశంపై విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ యాజమాన్యంపై మండిపడ్డారు.
ఈ ఘటన మరువక ముందే అదే కాకతీయ యూనివర్సిటీలోని రాణిరుద్రమదేవి హాస్టల్ గదిలో పైకప్పు ఊడిపోయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా శాఖ మంత్రి లేరు. వసతి గృహాల్లోని విద్యార్థుల రక్షణపై ప్రభుత్వానికి సైతం కనీస చిత్తశుద్ధి లేదని మండిపడుతున్నారు. పైకప్పు కూలి పడిపోయిన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.
కాగా, యూనివర్సిటీలోని రాణిరుద్రమదేవి హాస్టల్‌ను పరిశీలించేందుకు రిజిస్ట్రార్ మల్లారెడ్డి వెళ్లారు. హాస్టల్ గదిని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌కు వచ్చిన రిజిస్ట్రార్ మల్లారెడ్డిని విద్యార్థులు అడ్డుకున్నారు. హాస్టళ్లను ఎవరూ పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్ గో బ్యాక్ అంటూ విద్యార్థి సంఘాల నాయకులు నినాదాలు చేశారు. మల్లారెడ్డితో వాగ్వాదానికి దిగారు.