వికలాంగుల కోటాలో ఆమె తన ప్రత్యేక హక్కును దేనికి ఉపయోగించింది? ఇన్‌స్టిట్యూట్‌లను నడపడానికాలేదా ఫీల్డ్ వర్క్ ద్వారా ప్రజలకు సేవ చేయడానికా అని ప్రశ్నించాలని సుధాకర్ ఉడుములకు స్మితా సూచించింది.
న్యూస్ లైన్ డెస్క్: వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. వైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్ నియమించుకుంటుందా? లేదా వైకల్యం ఉన్న సర్జన్‌ని నమ్ముతారా అని ఆమె ప్రశ్నించారు. AIS అనేది ఫీల్డ్ వర్క్, పన్నులు విధించడం, ప్రజల మనోవేదనలను నేరుగా వినడం వంటివి ఉంటాయని ఆమె తెలిపారు. కాబట్టి ఈ ప్రీమియర్ సర్వీస్‌కు వికలాంగుల కోటా అవసరమా అని స్మితా ప్రశ్నించారు.
తాజగా, స్మితా పోస్ట్‌పై CSB IAS అకాడమీ చీఫ్ బాల లత ఘాటుగా స్పందించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. IAS అవ్వాలంటే అందగత్తెలు అవ్వాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. అంగవైకల్యం ఉన్నవారి గురించి ఆ రకంగా మాట్లాడడానికి స్మితాకు ఏ అర్హత ఉందని ప్రశ్నించారు. సివిల్స్ పరీక్ష రాస్తానని.. తన కన్నా ఎక్కువ మార్కులు సాధించాలని ఆమె స్మితాకు సవాల్ విసిరారు.
అయితే, బాల లత చేసిన సవాల్‌ను స్మితా స్వీకరించినట్లు తెలుస్తోంది. బాల లత విసిరిన ఛాలెంజ్ స్వీకరిస్తున్నానంటూ ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆమె చెప్పినట్లుగానే మరోసారి పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. కానీ, తన వయసు ఎక్కువ ఉండడం వల్ల అందుకు UPSC ఒప్పుకోదేమో అంటూ పోస్ట్ పెట్టారు. జర్నలిస్ట్ సుధాకర్ ఉడుముల ఆమెకు ప్రతినిధిగా నడుచుకుంటున్నారు కాబట్టి.. బాల లతను ఆయన ఒక ప్రశ్న అడగాలని స్మితా కోరారు.
వికలాంగుల కోటాలో ఆమె తన ప్రత్యేక హక్కును దేనికి ఉపయోగించింది? ఇన్‌స్టిట్యూట్‌లను నడపడానికాలేదా ఫీల్డ్ వర్క్ ద్వారా ప్రజలకు సేవ చేయడానికా అని ప్రశ్నించాలని సుధాకర్ ఉడుములకు స్మితా సూచించింది.
ఇది ఇలా ఉండగా.. స్మితా తీరుపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మితాలో ఫ్యూడల్ భావజాలం ఉందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆమె ఆలోచనావిధానాన్ని మార్చుకుంటే బాగుంటుందని అంటున్నారు. వికలాంగులను కించపరిచే విధంగా నడుచుకోవడం సరికాదని కామెంట్ చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్తామని హెచ్చరిస్తున్నారు.
I would take on her odd challenge but doubt UPSC will permit me due to my advanced age
Tags : india-people ts-news newslinetelugu telanganam smithasabarwal balalatha phc