Sridhar Reddy: బండిని మెంటల్ హాస్పిటల్‌లో చేర్చాలి

 మేము బీజేపీలో విలీనం అవుతామని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. బండి సంజయ్‌ను ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్థానంలో ఏ కార్యకర్తకు సీటు ఇచ్చినా మోడీ పేరుతో గెలిచేవారని అన్నారు.
 


Published Aug 11, 2024 02:03:44 PM
postImages/2024-08-11/1723365224_SridharReddy.jpg

న్యూస్ లైన్ డెస్క్: బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి కూడా  అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఆయన కేటీఆర్‌ను జైల్లో వేయాలని రేవంత్ రెడ్డికి చెప్పడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు. కేటీఆర్ ఏం తప్పు చేశారని జైల్లో పెడతారని అన్నారు. కేటీఆర్‌ను జైల్లో వేయకపోతే యుద్ధం చేస్తానని బండి సంజయ్ అంటున్నారు. జైల్లో వేసే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకుంటారా అని ప్రశ్నించారు. 

కిషన్ రెడ్డి, బండి సంజయ్, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. బండి సంజయ్ ఎంపీగా ఉండి మసీదులు తవ్వుతానని అన్నారు. ఇప్పుడు జైశ్రీరామ్ పేరుతో కేంద్ర మంత్రి అయ్యారని తెలిపారు. పదేళ్లు రాష్ట్ర మంత్రిగా కేటీఆర్ ఏం చేశారో చర్చకు బండి సంజయ్ సిద్ధమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇద్దరు తెలివితక్కువ కేంద్ర మంత్రులు ఉన్నారు. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రోటోకాల్‌తో ఢిల్లీకి, హైదరాబాద్‌కు చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అర్హత తెలుసా అని నిలదీశారు. 

కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేస్తేనే నేను ఎంపీ అయ్యాయని బండి సంజయ్ అనలేదా అని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్ నోటికి పాకిస్థాన్, బంగ్లాదేశ్ తప్ప వేరే పేర్లు రావన్నారు. కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ పార్టీ చేతిలోనే ఓడిపోయారని గుర్తుచేశారు. బండి సంజయ్‌కు దమ్ముంటే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో పది శాతం సర్పంచులు, పది శాతం ఎంపీటీసీలు, ఒక్క జడ్పీటీసీ గెలిచి చూపించు అని సవాల్ విసిరారు. కార్యకర్తల రక్తంతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ పదవులు అనుభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేసేందుకు కేంద్ర మంత్రులు చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు.

రాష్ట్రంలో ఉన్న సమస్యలపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఎందుకు విలీనం అవుతుందని ప్రశ్నించారు. మేము బీజేపీలో విలీనం అవుతామని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. బండి సంజయ్‌ను ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్థానంలో ఏ కార్యకర్తకు సీటు ఇచ్చినా మోడీ పేరుతో గెలిచేవారని అన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu tspolitics telangana-bhavan telanganam bandi-sanjay kishan-reddy ravula-sridhar-reddy

Related Articles