ఆ ఇళ్లు నిర్మించుకున్న వారికి 2007లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇళ్ల పట్టాలు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఆ తరువాత BRS అధికారంలోకి వచ్చిన తరువాత మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చింది.. కరెంట్ ఇచ్చి, లైట్లు వేసిందని ఆయన వెల్లడించారు. పట్టాలు ఇచ్చిన వారిపైన చర్యలు తీసుకోండి
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతల ప్రకంపనలే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో చెరువుల స్థలాల్లో నిర్మించిన కట్టడాలను కూల్చేస్తున్న హైడ్రా ఇప్పుడు జిల్లాల్లోని పేదల ఇళ్లు కూల్చేస్తోంది. ఇప్పటికే మహబూబ్‌నగర్‌లోని క్రిస్టియన్ పల్లి సమీపంలోని ఆదర్శనగర్‌లో ఇళ్లు కూల్చేశారు. దీంతో ఇళ్లు కోల్పోయిన పేదలు రోడ్డున పడ్డారు. ఇళ్లు కోల్పోయిన వారికి మాజీ మంత్రి, BRS నెత శ్రీనివాస్ గౌడ్ అల్పాహారం ఏర్పాటు చేయించారు. ఈ అంశంపై శుక్రవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడిన ఆయన.. హైడ్రా గురించి సంచలన విషయాలను బయటపెట్టారు.
మహబూబ్‌నగర్‌లో అంధుల కాలనీలో అర్ధరాత్రి 400 మంది పోలీసులు వెళ్లి అంధుల ఇండ్లు కూల్చివేశారని ఆయన వెల్లడించారు. అంధులు వేడుకున్నా పోలీసులు వారిని వదలలేదని తెలిపారు. అర్ధరాత్రి వేళ వెళ్లి నోటీస్ లేకుండా పేదల ఇళ్లను కూల్చేశారని ఆయన తెలిపారు. తమ సామాగ్రిని తీసుకుంటామని బ్రతిమిలాడినా సమయం ఇవ్వలేదని అన్నారు. ఆ ఇళ్లు నిర్మించుకున్న వారికి 2007లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇళ్ల పట్టాలు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఆ తరువాత BRS అధికారంలోకి వచ్చిన తరువాత మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చింది.. కరెంట్ ఇచ్చి, లైట్లు వేసిందని ఆయన వెల్లడించారు. పట్టాలు ఇచ్చిన వారిపైన చర్యలు తీసుకోండి
నాలుగేళ్ల పాటు పెన్షన్ డబ్బులతో చిట్టీలు వేసుకొని పేదలు ఆ ఇళ్లను నిర్మించుకున్నారని ఆయన వెల్లడించారు. అక్కడ అసలు చెరువే లేదని, కుంట కూడా కాదని.. అయినప్పటికీ పేదల ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చేశారని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూమి కూడా రూ.కోట్లు విలువ చేసేది కాదని వెల్లడించారు. బడాబాబులకు 30 రోజుల సంజాయిషి నోటీస్‌లు ఇస్తారు. ఈ ప్రభుత్వం పేదవారిని ఒకలాగా, ధనవంతులను ఒకలాగా చూస్తోందని ఆయన మండిపడ్డారు.
నోటిస్ లేకుండా కూల్చమని చట్టంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ సాదించుకున్నది బలహీన వర్గాలపైన దాడుల కోసమా అని అడిగారు. ఈ ప్రభుత్వం పేదల కోసం ఎన్ని ఇండ్లు కట్టిందో తెలియదు కానీ.. పేదలు కట్టుకున్న ఇండ్లను మాత్రం కూల్చేస్తోందని విమర్శించారు. అన్ని పార్టీలు మానవీయ కోణంలో స్పందించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం వారికి అక్కడనే పక్కా ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించాలి, విచారణ జరగాలని శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు.