శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా కొనసాగింది.
న్యూస్ లైన్ డెస్క్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా కొనసాగింది. దీంతో 7 గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని శనివారం అధికారులు విడుదల చేశారు. ఎగువ పరివాహక ప్రాంతాలు జూరాల నుంచి 3,20,805 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 4,479 క్యూసెక్కులు మొత్తం 3,25,284 వరద నీరు వస్తోంది. డ్యాం 7 క్రస్టు గేట్లను ఎత్తి 4,71,730 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 805 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 210.5133 టీఎంసీలుగా ఉంది. సాగర్ పూర్తి స్ధాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా.. 586.80 అడుగులకు చేరింది. దిగువన పులిచింతలకు 5,43,070 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 5,43,433 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 2,16,482 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 2,62,356 క్యూసెక్కులు ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.