సీనియర్ ఎన్టీఆర్ ఇప్పటికి చాలామంది ప్రజలకు ఈయన ఆరాధ్య నాయకుడు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా కీర్తిని గడించాడు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ వల్లే సినిమా ఇండస్ట్రీ ఈ పొజిషన్ లోకి
న్యూస్ లైన్ డెస్క్: సీనియర్ ఎన్టీఆర్ ఇప్పటికి చాలామంది ప్రజలకు ఈయన ఆరాధ్య నాయకుడు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా కీర్తిని గడించాడు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ వల్లే సినిమా ఇండస్ట్రీ ఈ పొజిషన్ లోకి వచ్చింది. ఆయన ఈ సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించారు. పార్టీ స్థాపించిన సంవత్సరంలోపే అధికారంలోకి తీసుకువచ్చి ఎన్నో సంస్కరణలు చేసి రెండు, తెలుగు రాష్ట్రాలకు ఆరాధ్య నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలా తన జీవితంలో ఎన్నో మంచి పనులు ఉన్నాయి తప్ప ఎవరికి అన్యాయం మాత్రం చేయలేదు.
అలాంటి సీనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా కష్టపడే గుణం ఉన్న వ్యక్తి. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే మనస్తత్వం వల్ల ఆయన అంతటి స్థాయికి వచ్చారని చెప్పవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ తాను చనిపోయే వరకు కూడా నియమ నిబద్ధతతోనే బతికారు. ఉదయం 3 గంటలకే నిద్రలేచి ఆయన పనులు స్టార్ట్ చేసేవారు. ఆయనకి ఈ మూడు గంటల సమయం సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత అలవాటు కాలేదు తన చిన్నతనం నుంచే ఈ అలవాటు చేసుకున్నారట. అయితే సినిమా ఇండస్ట్రీలోకి ఎన్టీఆర్ రాకముందు పాల వ్యాపారం చేసేవారు. నిమ్మకూరులో తెల్లవారుజామున మూడు గంటలకు లేచి పాలు పితుక్కుని సైకిల్ మీద విజయవాడ వచ్చి ఇంటింటికి వెళ్లి పాలు పోసేవారు.
ఇక అప్పటినుంచి ఆయనకు మూడు గంటలకు లేవడం అనేది అలవాటైపోయింది. విజయవాడలో ఒక సంపన్న కాలనీలో కూడా ఎన్టీఆర్ పాలు పోసేవారు. అలా పాలు పోస్తున్న తరుణంలో ఒక ఇంట్లో అందమైన అమ్మాయి ప్రతిరోజు ఎదురుపడేది. అలా పాలు పోస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య చూపులు కలిసిపోయాయి. అలా ప్రతిరోజు ఆ అమ్మాయి ఉదయం 3 గంటల వరకే రెడీ అయిపోయి ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తూ ఉండేది. అలా వీరి మధ్య ప్రేమ కథ మొదలై కొన్ని రోజులు గడిచింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పాలు పోయడానికి వచ్చే సమయంలో కాస్త ఆగి అక్కడే ముచ్చటించి ఎన్టీఆర్ వెళ్ళిపోయేవాడు. అలా కొన్నాళ్లకు ఈ విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది. పెద్ద గొడవ జరగడంతో ఇక ఎన్టీఆర్ మా ఇళ్లకు పాలు పోయడానికి రావద్దని వారు ముఖం మీద చెప్పేశారు.
అయినా ఎన్టీఆర్ మాత్రం ఆ వీధికి వెళ్లడం మానలేదు. చాటుచాటుకు ఇద్దరు చూపులు కలుస్తూనే ఉండేవి. ఇలా కూడా వీరు వినడం లేదని చివరికి ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ పూర్తిగా ఆ ఊరు వదిలేసి మరోచోటికి వెళ్లిపోయారు. అయితే అప్పట్లో ఫోన్లు లేవు కాబట్టి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లిందో ఎన్టీఆర్ కు మళ్లీ తెలియలేదు. అలా ఎన్టీఆర్ మొదటిసారి ప్రేమలో పడ్డది ఆ అమ్మాయితోనే. అలా ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చేముందే "బసవతారకంను" పెళ్లి చేసుకున్నారు. ఈ లవ్ స్టోరీని ఎన్టీఆర్ బయోపిక్ "కథానాయకుడు"లో క్రిష్ ఈ ఎపిసోడ్ చూపిద్దాం అనుకున్నారట. కానీ చివరికి తెరకెక్కించలేదు.