రాష్ట్రంలోని పలు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు ఆందోళనలు చేపడుతున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఈరోజు భారత్ బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. భారత్ బంద్‌కు మద్దతుగా రాష్ట్రంలో ఆందోళనలు మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ బస్సు డిపోతో పాటు రాష్ట్రంలోని పలు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు ఆందోళనలు చేపడుతున్నారు.
ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదుట భైఠాయించి ధర్నా చేశారు. ఎస్సీ వర్గీకరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని దళిత నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో బస్సులతో పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.