అన్నమయ్య జిల్లా కురబలకోట మండల పరిధిలోని ముదివేడు గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేసినట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు. తొమ్మిదో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు మోతాదుకు మించి ట్యాబ్లేట్స్ వేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న విద్యార్థులను హాస్పిటల్‌కు తరలించినట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు. విద్యార్థులకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఇటీవల గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో ఇప్పటికే గడిచిన నాలుగు నెలల్లోనే ముగ్గురు విద్యార్థినులు అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలు మరువకముందే ఏపీలోని గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది.
అన్నమయ్య జిల్లా కురబలకోట మండల పరిధిలోని ముదివేడు గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేసినట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు. తొమ్మిదో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు మోతాదుకు మించి ట్యాబ్లేట్స్ వేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న విద్యార్థులను హాస్పిటల్‌కు తరలించినట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు. విద్యార్థులకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఒకేసారి ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు హాస్టల్ సిబ్బంది కారణంగానే విద్యార్థులు చనిపోయేందుకు ప్రయత్నించారని వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.