ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ, సీబీఐ నుంచి ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో మొదలైన కవిత బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో ద్విసభ్య ధర్మాసనం కీలక కామెంట్లు చేసింది.
న్యూస్ లైన్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ, సీబీఐ నుంచి ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో మొదలైన కవిత బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో ద్విసభ్య ధర్మాసనం కీలక కామెంట్లు చేసింది. పిటిషన్ విచారణ చేస్తూ న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ ఈడీ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. గంటన్నర పాటు వాదనలు విన్న జడ్జిమెంట్ బెంచ్.. తీర్పు సందర్భంగా సంచలన కామెంట్లు చేసింది.
కేసు మెరిట్ నెస్ లోకి వెళ్లడం లేదని.. విచారణ పూర్తయి చార్జిషీట్ దాఖలైనా కవితను ఇంకా జైలులో ఎందుకు ఉంచారని ధర్మాసనం ఫైర్ అయింది. సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందేందుకు కవితకు అర్హత ఉన్నా ఎందుకు తాత్సారం చేశారని ఈడీ, సీబీఐలను అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఒకవేళ కవిత బెయిల్ తిరస్కరించాలంటే సరైన కారణం చూపించాలని.. అలాంటి కారణాలేవీ చూపకుండా పలుమార్లు ఆమె బెయిల్ ను ఎందుకు తిరస్కరించారని ధర్మాసనం ప్రశ్నించింది. కవిత బెయిల్ విషయంలో తెలంగాణ హైకోర్టు పట్ల కూడా సుప్రీం కోర్టు సీరియస్ అయింది.