ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం అనుమతి ఇచ్చింది. 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని ధర్మాసనం స్పష్టం చేసింది. దీన్ని మెజారిటీ సభ్యులు అంగీకరించినట్లు తెలుస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం కోర్టులో గురువారం విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ ధర్మాసనంలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోసం ఆయా వర్గాలు గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిగిన ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది.
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం అనుమతి ఇచ్చింది. 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని ధర్మాసనం స్పష్టం చేసింది. దీన్ని మెజారిటీ సభ్యులు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, జస్టిస్ బేలా త్రివేది వర్గీకరణను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. దీంతో ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నారని సుప్రీం తెలిపింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అవసరమని, వర్గీకరణచేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది.