సాక్ష్యాలను కవిత తారుమారు చేశారని ఎస్వీ రాజు ఆరోపించారు. కవిత ఫోన్లలో 10 రోజుల డేటా మాత్రమే రికవరీ వచ్చిందని ఆయన అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: BRS ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కవిత గత ఐదు నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ బెంచ్ విచారణ జరుపుతోంది. కవిత తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదిస్తున్నారు.
ఈడీ నోటీస్ రాగానే అన్ని ఫోన్లను ధ్వంసం చేశారని ఎస్వీ రాజు ఆరోపించారు. అయితే, ఫోన్లను ధ్వంసం చేయలేదని.. ఫార్మాట్ చేసి ఇంట్లో పనిచేసేవారికి ఇచ్చారని రోహత్గీ తెలిపారు. సాక్ష్యాలను కవిత తారుమారు చేశారని ఎస్వీ రాజు ఆరోపించారు. కవిత ఫోన్లలో 10 రోజుల డేటా మాత్రమే రికవరీ వచ్చిందని ఆయన అన్నారు.
ఫోన్‌లో ఉన్న సమాచారం ధ్వంసం చేశారని అన్నారు. విచారణ సమయంలో కవిత సహకరించలేదని ఆయన ఆరపించారు. ఫోన్‌లో డేటా ఎక్కువైనప్పుడు డిలీట్ చేయడం సాధారణమని ఈడీ తెలిపింది. కానీ, కానీ ఫార్మాట్ చేయడం సహజం కాదని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన జస్టిస్ బీఆర్ గవాయ్.. కవిత నిరక్షరాస్యులు కాదని అన్నారు. అఫ్రూవర్ అరుణ్ పిళ్లై స్టేట్‌మెంట్ ఎందుకు ఉపసంహరించుకున్నారు..? అని ఆయన ప్రశ్నించారు. కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాదిని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఫోన్‌లో మెసేజ్‌లు డిలీట్ చేయడం సహజమే కదా? అని ప్రశ్నించింది.