కేరళ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడడంతో వయనాడ్ జిల్లా ముండక్కయ్ , చోర్ మల , అత్తమల , నూల్ పూజా గ్రామాలు నాశనమయిపోయాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కేరళ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడడంతో వయనాడ్ జిల్లా ముండక్కయ్ , చోర్ మల , అత్తమల , నూల్ పూజా గ్రామాలు నాశనమయిపోయాయి. బురదలో ఎంతో మంది చిక్కుకుపోయి ...శవాల దిబ్బలా తయారయ్యింది. దాదాపు 300 పైగా చనిపోయారు. మరో 250 మంది గల్లంతయిపోయారు. ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా బాధితుల్ని సహాయకచర్యలు అందించారు. కాపాడారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.. ఇదిలా ఉంటే కేరళకు తమిళ ఇండస్ట్రీ నుంచి సాయం అందిస్తున్నారు.
మాలీవుడ్ నటి నిఖిలా విమల్ వాలంటీర్‌గా మారి.. బాధితులకు అవసరమైన ఆహారం, వస్తు సామాగ్రిని ప్యాక్ చేసి తన వంతు తోడ్పాటును అందించింది. తనతో పాటు చాలా యాక్టర్స్ , సెలబ్రెటీస్ తనకు తోచిన సాయం చేస్తున్నారు. ఇప్పటికే చియాన్ విక్రమ్ రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాడు. తమిళ హీరో సూర్య, జ్యోతిక, హీరో కార్తీక్ వయనాడ్ వరద బాధితులకు తమ వంతు సాయంగా రూ. 50 లక్షల రూపాయల నగదును అందించారు. రష్మిక కూడా రూ. 10 లక్షల సాయాన్ని ప్రకటించింది.
లూలు గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎంఏ యూసఫలి, ప్రముఖ పారిశ్రామికవేత్త రవి పిళ్లై, కళ్యాణ్ జ్యువెలర్స్ యజమాని కళ్యాణరామన్ ఒక్కొక్కరు రూ.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆదానీ పోర్ట్ గ్రూప్ కూడా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడానికి 5 కోట్ల రూపాయలను హామీ ఇచ్చింది. ఇలా కేరళకు తోచిన సాయం చేస్తూనే ఉన్నారు.