Piracy : తమిళ్ రాకర్స్ అడ్మిన్ స్టీఫెన్ అరెస్ట్.. పైరసీ చేసిన తీరు చెప్తుంటే..

తెలుగు, తమిళ, కన్నడ సినిమాల వసూళ్లపై పైరసీ పెను ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. దశాబ్ద కాలంగా పలు సినిమాలను పైరసీ చేస్తున్న తమిళ రాకర్స్ ఆట కట్టించారు తమిళనాడు పోలీసులు.


Published Jul 29, 2024 02:22:54 AM
postImages/2024-07-29/1722237699_Piracyking.jpg

న్యూస్ లైన్ డెస్క్ : పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీకి ఉన్న అతిపెద్ద శత్రువు. కొన్నేళ్లుగా తెలుగు, తమిళ, కన్నడ సినిమాల వసూళ్లపై పైరసీ పెను ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. దశాబ్ద కాలంగా పలు సినిమాలను పైరసీ చేస్తున్న తమిళ రాకర్స్ ఆట కట్టించారు తమిళనాడు పోలీసులు.

పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు ఇలా.. థియేటర్లలోకి, ఓటీటీలోకి రాగానే.. వెంటనే ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతుంది. దర్శకులు, నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ పైరసీ భూతాన్ని ఎంత అరికడుదామనుకున్నా సాధ్యపడటం లేదు. పైరసీ వెబ్ సైట్లను ఎన్నిసార్లు బ్లాక్ చేసినా కొత్త పేరుతో మళ్లీ వచ్చేస్తున్నారు. తాజాగా విడుదలైన ధనుష్ రాయన్ సినిమా కూడా పైరసీకి గురైంది. రిలీజ్ రోజే ఆన్ లైన్ లో రాయన్ పైరసీ వీడియోలు దర్శనమిచ్చాయి. ఈ విషయమై మూవీ మేకర్స్ నేరుగా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమిళ రాకర్స్ మాఫియా ఈ పైరసీకి కారణమని గుర్తించారు. తమిళనాడులో విడుదలైన సినిమాలను కేరళ నుంచి పైరసీ చేస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్ కి వెళ్లి తమిళ రాకర్స్ వెబ్ సైట్ అడ్మిన్  జెబ్ స్టీఫెన్ రాజ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

తన ఫోన్ లో జెబ్ స్టీఫెన్ రాజ్ తన ఫోన్ లో రాయన్ సినిమాను రికార్డ్ చేస్తుండగా కేరళ సైబర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు. స్టీఫెన్ రాజ్ ను విచారించేందుకు తమిళనాడు పోలీసులకు అప్పగించారు. విచారణ చేపట్టిన పోలీసులకు తమిళ రాకర్స్ సైట్ అడ్మిన్ సంచలన నిజాలు బయటపెట్టాడు. సినిమాలో ఎలా రికార్డు చేస్తాడో చెప్తుంటే పోలీసులు విస్తుపోయారు.

కొత్త సినిమాలు రిలీజైన రోజే ఆరు నుంచి ఏడు బాల్కనీలో స్పెషల్ టికెట్లు బుక్ చేసుకుంటారట. అలా అని ఒకటి రెండు కాదు.. ఏడు నుంచి  ఎనిమిది సీట్లు తమిళ రాకర్స్ సైట్ సభ్యులు బుక్ చేస్తారట. రికార్డ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ బ్రైట్ నెస్ తగ్గిస్తారు. సీటుపై కప్ హోల్డర్ మీద ఫోన్ పెట్టి థియేటర్ వెనుక సీట్లో కూర్చొని సినిమా కాపీ చేస్తామని.. థియేటర్ నుంచి బయటకు వచ్చేలోపే వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తామని చెప్పుకొచ్చాడు స్టీఫెన్ రాజ్.

newsline-whatsapp-channel
Tags : movies movie-news crime- new-movie crime kerala-heroine- tamilnadu latest-news rayaan-movie dhanush

Related Articles