Teachers: బదిలీలో అవకతవకలు.. ఉపాధ్యాయుల ధర్నా

సోషల్ వెల్ ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లలో ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తు మాసబ్ ట్యాంక్ వద్ద సంక్షేమ భవన్‌లోని సొసైటీ కార్యాలయం ముందు ఉపాధ్యాయుల భారీ ఎత్తున ధర్నాకు దిగారు.


Published Aug 21, 2024 05:22:46 PM
postImages/2024-08-21/1724241166_teach.PNG

న్యూస్ లైన్ డెస్క్: సోషల్ వెల్ ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లలో ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తు మాసబ్ ట్యాంక్ వద్ద సంక్షేమ భవన్‌లోని సొసైటీ కార్యాలయం ముందు ఉపాధ్యాయుల భారీ ఎత్తున ధర్నాకు దిగారు. రాత్రికి రాత్రే రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఎలా ఉత్తర్వులు ఇచ్చిందని ఉపాధ్యాయులు మండిపడ్డారు. ఆదిలాబాద్ నుంచి చిన్న పిల్లలను తీసుకొని వచ్చాము అంటూ  టీచర్లు వాపోతున్నారు.

హైకోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోకుండనే బదిలీలు జరిగాయి అని వారు ఆరోపించారు. వందల కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్‌లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని టీచర్లు కోరారు.

newsline-whatsapp-channel
Tags : india-people fire congress school-teacher cm-revanth-reddy telanganahighcourt

Related Articles