టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. లంక సిరీస్‌లో భాగంగా 3 టీ20, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.
న్యూస్ లైన్ స్కోర్ట్స్: టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. లంక సిరీస్‌లో భాగంగా 3 టీ20, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇప్పటీకే రెండు టీ20 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్ సిరీస్ టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ జరగనుంది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జూలై 30న జరగనుంది. ఈ సిరీస్ ముగియగానే వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం భారత సారథి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ కొలంబోలో అడుగుపెట్టారు. వీరంతా కొలంబో ఎయిర్ పోర్టు నుంచి ఐటీసీ రత్నదీప హోటల్‌కు తరలి వెళ్లారు. టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమిండియా ఆ తర్వాత భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అయితే రోహిత్, విరాట్ టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో వీరు వన్డే సిరీస్ కోసం కొలంబో చేరుకున్నారు. వన్డే సిరీస్‌లో పాల్గొనే టీమిండియా ప్లేయర్స్ నేటి నుంచి నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటారు. భారత వన్డే జట్టులోని మిగతా ఆటగాళ్లు లంకతో చివరి టీ20 మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టుతో కలవనున్నారు. సెలెక్టర్లు శ్రీలంక పర్యటనలో టీ20, వన్డే సిరీస్ లకు రెండు జట్లను ఎంపిక చేసిన విసయం తెలిసిందే.