Big Breaking: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య

మొన్న తుంగభద్ర, నిన్న ప్రకాశం బ్యారేజ్.. నేడు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు సమస్యల్లో చిక్కుకున్నాయి. 
 


Published Sep 02, 2024 01:36:05 PM
postImages/2024-09-02/1725264365_srisialamgatesdamage.jpg

న్యూస్ లైన్, శ్రీశైలం: గతంలో ఎన్నడూ లేని విధంగా వరద నీరు ప్రాజెక్టులకు పోటెత్తుతుంది. వరద ఉధృతికి ఏకంగా గేట్లు దెబ్బతింటున్నాయి. మొన్న తుంగభద్ర, నిన్న ప్రకాశం బ్యారేజ్.. నేడు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు సమస్యల్లో చిక్కుకున్నాయి. 

తాజాగా శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరదనీటిని కిందకు వదిలేందుకు గేట్లను ఎత్తుతుండగా నీటి ఒత్తిడి కారణంగా 2,3 నెంబర్ గేట్ల ప్యానెల్ బ్రేక్ కాయిల్స్ కాలిపోయాయి. వెంటనే గుర్తించిన అధికారులు మరమ్మతులు మొదలుపెట్టారు. ప్రాజెక్టులోకి 3.26 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, ప్రాజెక్టు నుండి సాగర్‌కు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలతో కలిపి 3.80 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేశారు.

newsline-whatsapp-channel
Tags : india-people ts-news news-line newslinetelugu telanganam srisailam srisailam-project srisailam-gates-open

Related Articles