కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే తరుణంలో శనివారం, ఆదివారం కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, డ్యాములు అన్ని పూర్తిగా
న్యూస్ లైన్ డెస్క్: కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే తరుణంలో శనివారం, ఆదివారం కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, డ్యాములు అన్ని పూర్తిగా నిండిపోయాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. అలాంటి ఈ తరుణంలో వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేస్తోంది. ఎనిమిది జిల్లాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలని తెలియజేస్తోంది.
జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. అంతేకాదు ఈ వర్షాలు ఐదు రోజులపాటు కురుస్తాయని ఐఎండి వెల్లడించింది. ఇదే క్రమంలో యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, అదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచే ఛాన్స్ ఉందని రెడ్ అలెర్ట్ ప్రకటించింది.
ఇవే కాకుండా కొత్తగూడెం, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, సంగారెడ్డి, జిల్లాలో భారీ వర్షాలు పడతాయని అన్నది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఇవే కాకుండా జోగులాంబ గద్వాల, మల్కాజ్ గిరి, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, వాటర్ లో ఉండే విద్యుత్ వస్తువులను ముట్టుకోకూడదని, సాహసం చేసి వాగులు దాటకూడదని వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేస్తోంది.