న్యూస్ లైన్ డెస్క్ : సివిల్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం ప్రకటించింది. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అర్హులకు రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకాన్ని ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. సింగరేణి కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
కాగా.. దేశవ్యాప్తంగా దాదాపు 14 లక్షల మంది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు రాస్తున్నారు. ప్రతి ఏడాది సుమారు 50వేల మంది సివిల్స్ ప్రిలిమ్స్ కి దరఖాస్తు చేస్తున్నారు. కాగా.. వీరిలో 400 నుంచి 500 మంది మాత్రమే అర్హత సాధిస్తున్నారు. కాగా.. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం సివిల్స్ అర్హులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. అయితే.. ఈ పథకమైనా అమలు చేస్తారా? లేక గత హామీల్లాగే పక్కకు పెడతారా అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నియి.