రాష్ట్రంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
న్యూస్ లైన్ డెస్క్ : రాష్ట్రంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో అర్హుల వారిగా వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలుగా, మూడున్నర ఎకరాల మాగాణి, ఏడున్నర ఎకరాల చెలక ఉండాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.2 లక్షలుగా సూచించారు. పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు స్వైపింగ్ మోడల్ లో ఉండాలని సర్కార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
తెల్ల రేషన్ కార్డుల మంజూరుపై అతి త్వరలో విధి విధానాలు ఖరారు చేసి అమలు చేసేందుకు కసరత్తులు చేయాలని అధికారులకు సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సక్సేనా కమిటీ సిఫార్సులను పరిశీలించాలని ఒక కుటుంబానికి ఒకే తెల్లరేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేరే రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఉంటే తెలంగాణలో తీసేయాలని క్యాబినేట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.