తమపై జరుగుతున్న వరుస దాడులను ఇప్పటికైనా ఆపాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం జర్నలిస్టులు శంకర్, ప్రభాకర్, లింగస్వామి, ప్రవీణ్ ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటి ముందు, జంతర్ మంతర్, AICC కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి తెలంగాణ జర్నలిస్టులు మెమొరాండం ఇచ్చారు. తెలంగాణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన వివరాలను మెమొరాండంలో చేర్చారు. రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను జర్నలిస్టులు వివరించారు. తెలంగాణ జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల గురించి తెలిపారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు.
కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే జర్నలిస్టులు శంకర్, చిలుక ప్రవీణ్, సరిత ఆవుల, విజయారెడ్డిలపై దాడులు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా న్యూస్ లైన్ తెలుగు టీం జర్నలిస్టులు ధర్నా చేస్తున్నారు. తమపై జరుగుతున్న వరుస దాడులను ఇప్పటికైనా ఆపాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం జర్నలిస్టులు శంకర్, ప్రభాకర్, లింగస్వామి, ప్రవీణ్ ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటి ముందు, జంతర్ మంతర్, AICC కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.