Medchel: కుట్రలు.. కూల్చివేతలు..?

కూల్చివేస్తున్న భవనాలకు అన్ని అనుమతులు ఉన్నాయని బాధితులు అన్నారు. పీర్జాదిగూడ మున్సిపాలిటీతో పాటు హెచ్ఎండీఏ అనుమతులు కూడా ఉన్నాయన్నారు. అనుమతులు ఉన్నా ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రశ్నించారు. పైసా పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి,  నిర్మాణాలు చేపడుతున్నామని ఆవేద వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ అధికారులు స్థలాలకు ఎన్వోసీ కూడా ఇచ్చారని తెలిపారు. నిర్మాణాలు అవుతున్న సమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కూల్చి వేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-08/1720432351_Screenshot20240708151530.jpg

న్యూస్ లైన్ డెస్క్: పీర్జాదిగూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ నిర్మాణాలు కూల్చివేతలను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూల్చివేతలను అడ్డుకోబోయిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిపై మేయర్ జక్క వెంకట్ రెడ్డి మండిపడ్డారు. 

పీర్జాదిగూడ మేయర్ పదవిని దక్కించుకోవాలని కాంగ్రెస్ ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. దీని కోసం సీలింగ్ భూముల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధీర్ రెడ్డి అల్లుడు అమర్ సింగ్‌ను మేయర్ చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కుట్రలో భాగంగానే ఈ బిల్డింగ్ నిర్మాణాలు కూల్చివేస్తున్నారని అన్నారు.

కూల్చివేస్తున్న భవనాలకు అన్ని అనుమతులు ఉన్నాయని బాధితులు అన్నారు. పీర్జాదిగూడ మున్సిపాలిటీతో పాటు హెచ్ఎండీఏ అనుమతులు కూడా ఉన్నాయన్నారు. అనుమతులు ఉన్నా ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రశ్నించారు. పైసా పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి,  నిర్మాణాలు చేపడుతున్నామని ఆవేద వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ అధికారులు స్థలాలకు ఎన్వోసీ కూడా ఇచ్చారని తెలిపారు. నిర్మాణాలు అవుతున్న సమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కూల్చి వేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu hyderabad brs telanganam police ghmc mayor

Related Articles