సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని BRSతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీంతో సచివాలయం బయట కాదు. లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సెక్రటేరియట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవరణను పరిశీలించారు. సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని BRSతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీంతో సచివాలయం బయట కాదు. లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ మేరకే మంగళవారం మధ్యాహ్నం సెక్రటేరియట్ ఆవరణను పరిశీలించారు. పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని ఆయన సూచించారు. తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలతో కలిసి స్థల పరిశీలన చేయడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అసలు తెలంగాణ ఉద్యమం సమయంలో జాడపత్తా లేని వాళ్లు తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలని సమాలోచనలు చేయడం హాస్యాస్పదం అంటూ కామెంట్లు చేస్తున్నారు.