RTC: ఆడపిల్లలపై ఆర్టీసీ కండక్టర్ బూతులు

ఆడపిల్లలు అని కూడా చూడకుండా విద్యార్థినులను బూతులు తిట్టిన కండక్టర్ నిర్వాకం బయటకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నుండి కేశంపేట మండలంలోని సంగెం గ్రామానికి వెళ్లే బస్సులోని కండక్టర్ రాములు తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాలికలు వాపోయారు. 


Published Aug 14, 2024 01:31:37 PM
postImages/2024-08-14/1723622497_students.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆడవారికి కనీస మర్యాద దక్కడంలేదనేది పచ్చి నిజమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకొని వచ్చిన మహాలక్షి పథకం ద్వారా వచ్చే లాభం ఎంతనో తెలియదు. కానీ, ఆధార్ చూపించి బస్సు ఎక్కే ఆడవారి పట్ల ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కనికరం లేకుండా నడుచుకుంటున్నారు. దీంతో చాలా చోట్ల మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. 

అయితే, ఆడపిల్లలు అని కూడా చూడకుండా విద్యార్థినులను బూతులు తిట్టిన కండక్టర్ నిర్వాకం బయటకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నుండి కేశంపేట మండలంలోని సంగెం గ్రామానికి వెళ్లే బస్సులోని కండక్టర్ రాములు తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాలికలు వాపోయారు. ఆడపిల్లలు అని కూడా చూడకుండా బూతులు తిడుతున్నారని వెల్లడించారు. ఆధార్ అప్ డేట్ లేకపోయినా, బ్యాగ్‌లో నుండి ఆధార్ బయటకు తీయడంలో ఆలస్యమైనా బండబూతులు తిడుతూ మధ్యలోనే బస్సులో నుంచి దింపి వేస్తున్నాడని వాపోయారు. ఆడపిల్లల పట్ల ఈ విధంగా నడుచుకుంటున్న కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu congress telanganam rtc free-bus-ticket free-bus tgsrtc rtcconductor

Related Articles