జూరాల, తుంగభద్ర నుంచి వరద పొటెత్తడంతో శ్రీశైలంకు 4లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో వచ్చిన వాటర్ ను వచ్చినట్లుగా నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు.
న్యూస్ లైన్, శ్రీశైలం: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. సోమవారం మధ్యాహ్నం వరకే గేట్లు తెరిచారు. అయితే ఇవాళ సాయంత్రం విడుదల చేయాలని ముందుగా భావించారు అధికారులు. అయితే ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అనుకున్న సమయం కంటే ముందుగానే ఓపెన్ చేశారు. 3 గేట్ల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతోంది.
జూరాల, తుంగభద్ర నుంచి వరద పొటెత్తడంతో శ్రీశైలంకు 4లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో వచ్చిన వాటర్‌ను వచ్చినట్లుగా నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి కెపాసిటి 215 టీఎంసీలు కాగా సోమవారం ఉదయం వరకు 175 టీఎంసీలకు పైగా చేరింది. అయితే గేట్లు ఎత్తినప్పటికీ మరో రెండు, మూడు రోజుల్లో శ్రీశైలం పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాగార్జునసాగర్ వైపు నీళ్లు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంత ప్రజలను సైతం అప్రమత్తం చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.
శ్రీశైలం డ్యాం మూడు గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతున్న అధికారులు pic.twitter.com/O8SezcpnoF — News Line Telugu (@NewsLineTelugu) July 29, 2024