నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుండగానే బయటకు వచ్చేసిన ఆమె.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలపై వివక్ష చూపుతున్నారని ఆమె మండిపడ్డారు.
న్యూస్ లైన్ డెస్క్: కాళేశ్వరం పంపులను రాష్ట్ర సర్కార్ స్టార్ట్ చేసింది. ఆగస్టు 2 లోగా కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లివ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నాప్రజల పక్షానే ఉంటామని ఇచ్చిన డెడ్ లైన్ లోగా నీళ్లు ఇవ్వాలని కేటీఆర్ హెచ్చిరించారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన అల్టిమేటంకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలపై సర్కార్ దిగివచ్చినట్లు తెలుస్తోంది.
కేటీఆర్ ఎఫెక్ట్...
నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన అల్టిమేటంకు స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం..
కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌజుల్లో పంపింగ్ మొదలు. పెద్దపల్లి జిల్లా నంది మేడారంలోని నంది పంపు హౌజ్‌లో ప్రారంభమైన నీటి పంపింగ్. pic.twitter.com/keki2Uh6Zc — News Line Telugu (@NewsLineTelugu) July 27, 2024
పెద్దపల్లి జిల్లా నంది మేడారంలోని పంప్ హౌస్‌లో మూడు మోటార్లు, గాయత్రి పంప్ హౌస్‌లో ఒక మోటార్‌ను ఆన్ చేసి నీటిని లిఫ్ట్ చేయిస్తున్నారు. ఇక కేవలం 24 గంటల్లోనే కేటీఆర్ ఇచ్చిన ట్రీట్‌మెంట్ పని చేసిందని పలువురు మాట్లాడుకుంటున్నారు.