వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 3 లక్షల 80 వేల వీధి కుక్కలున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యంకాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
న్యూస్ లైన్ డెస్క్: వీధి కుక్కల దాడుల ఘటనలో ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 3 లక్షల 80 వేల వీధి కుక్కలున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యంకాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రహదారులపై వ్యర్థాల వల్లే కుక్కల స్వైరవిహారం ఎక్కువైందని హైకోర్టు పేర్కొంది. వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. వచ్చే విచారణకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా, జవహర్ నగర్, కరీంనగర్, హుజురాబాద్ పట్టణంతో పాటు బోర్నపల్లిల్లో వీధి కుక్కల దాడిలో 25 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో కుక్కలా కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుక్కల దాడులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది.