Air bus: శంషాబాద్‌కు ప్రపంచంలోనే అతిపెద్దవిమానం..!

ప్రపంచంలోనే అతిపెద్దవిమానంగా దీన్ని గుర్తించారు. అందుకే ఈ విమానాన్ని ఆకాశ తిమింగలం(Sky whale) అని కూడా పిలుస్తారట. ఈ విమానం మస్కట్‌ నుంచి థాయ్‌లాండ్‌కు వెళ్లనుంది. 


Published Aug 30, 2024 06:07:56 PM
postImages/2024-08-30//1725021476_newslinetelugu83.jpg

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఓ అరుదైన విమానం ల్యాండ్ అయింది. దీని పేరు ఎయిర్ బస్ A300-600st బేలుగా. ప్రపంచంలోనే అతిపెద్దవిమానంగా దీన్ని గుర్తించారు. అందుకే ఈ విమానాన్ని ఆకాశ తిమింగలం(Sky whale) అని కూడా పిలుస్తారట. ఈ విమానం మస్కట్‌ నుంచి థాయ్‌లాండ్‌కు వెళ్లనుంది. 

ఈ నేపథ్యంలోనే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఎయిర్‌బస్ థాయ్‌లాండ్‌కు బయలుదేరింది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావడంతో అక్కడికి వెళ్లిన వారు దీని ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో స్కై వేల్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.


 

newsline-whatsapp-channel
Tags : india-people ts-news news-line newslinetelugu airplane telanganam shamshabad

Related Articles