మా ఆవేదనను మీరైనా అర్ధం చేసుకున్నారు' థాంక్యూ స్పీకర్ సార్' అంటూ హరీష్ రావు కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
న్యూస్ లైన్ డెస్క్: BRS ఎమ్మెల్యేలు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలుపుతూ నలుపు రంగు బట్టలు వేసుకొని అసెంబ్లీకి వెళ్లినందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ధన్యవాదాలు అని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి BRS ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన సబితా.. తనను ఎద్దేశించే రేవంత్ ఆ మాటలు అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మొహం పెట్టుకొని సబితా ఇంద్రారెడ్డిపై అసెంబ్లీకి వచ్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
దీనిపై స్పందించిన BRS ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల గురించి రేవంత్ రెడ్డి అటువంటి మాటలు అనడం సరికాదని మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో జరిగిన విషయం మహిళా ఎమ్మెల్యేలకే అవమానకరం కాదు. రాష్ట్రంలోని మహిళలు అందరికీ అవమానకరమని అన్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. BRS ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి వెళ్లారు.
అయితే, స్పీకర్ కూడా గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశానికి నల్ల డ్రెస్సులో వచ్చారు. దీంతో హరీష్ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పుట్టించాయి. బ్లాక్ డ్రెస్సులో వచ్చి స్పీకర్ తమ నిరసనల్లో పాల్గొన్నారని ఆయన అన్నారు. 'మా ఆవేదనను మీరైనా అర్ధం చేసుకున్నారు.థాంక్యూ స్పీకర్ సార్' అంటూ హరీష్ రావు కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.