Revanth: సీఎంకు మరో తలపోటు.. కొత్త కేసు..?

హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇందులో భాగంగానే పరువు నష్టం కేసులో రేవంత్‌కి ఇటీవల తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 


Published Sep 02, 2024 01:58:43 PM
postImages/2024-09-02/1725265723_newslinetelugu94.jpg

న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ఆయన నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ఆధారాలు లేని ఆరోపణలు చేశారని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు రేవంత్ రెడ్డిపై కేసు వేశారు.

హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇందులో భాగంగానే పరువు నష్టం కేసులో రేవంత్‌కి ఇటీవల తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇవన్నీ చాలవు అన్నట్లు.. సీఎం తన నోటి దురుసుతో ఉన్న వాటికి మరో తలనొప్పి తెచ్చిపెట్టుకున్నారని పలువురు అంటున్నారు. 

కవిత బెయిల్ పొందిన విషయంలో రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాల్లో నిలిచిన విషయం తెలిసిందే. పీసీసీగా రేవంత్ రెడ్డి ఉన్నందున కవిత బెయిల్ పై వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ పోస్టులపై వివరణ కోరింది. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్, వాట్సప్ గ్రూపుల్లో కవిత బెయిల్ అంశంపై వ్యాఖ్యలపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 

కవితకు బెయిల్ వచ్చిందా..? ఇచ్చారా..? ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని సోషల్ మీడియాలో పోస్ట్ తెలంగాణ కాంగ్రెస్ పోస్ట్ చేసింది. కమలంతో స్నేహం..తైతక్కకు మోక్షం అని తెలంగాణ కాంగ్రెస్ ట్విట్ చేసింది. వీటిపై సుప్రీం చాలా సీరియస్‌గా ఉంది. అందుకే, ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని ఆదేశించినట్లు తెలుస్తోంది. 

newsline-whatsapp-channel
Tags : india-people revanth-reddy supremecourt cm-revanth-reddy delhi kavitha

Related Articles