జనగామ జిల్లా చిల్పూర్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు వెంకటలక్ష్మి భూమిని కొనుగోలు చేసింది. అయితే, ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని రెవెన్యూ అధికారులు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోనట్లు తెలుస్తోంది. దీంతో మనస్థాపం చెందిన వెంకటలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె బంధువులు తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: గడిచిన 24 గంటల్లోనే ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. అంతేకాకుండా మరో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉంది. రైతుల వరుస ఆత్మహత్యలు రాష్ట్రంలో ఆందోళనకరంగా మారాయి.
జనగామ జిల్లా చిల్పూర్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు వెంకటలక్ష్మి భూమిని కొనుగోలు చేసింది. అయితే, ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని రెవెన్యూ అధికారులు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోనట్లు తెలుస్తోంది. దీంతో మనస్థాపం చెందిన వెంకటలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె బంధువులు తెలిపారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బెటి తండాకి చెందిన బానోత్ రాంధాన్, కమలమ్మ దంపతులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. 9 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశారు. రెండుసార్లు పత్తి గింజలు వేసినా మొలకెత్తలేదు. దీంతో అప్పులు పెరిగిపోవడంతో పాటు కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో కమలమ్మ తీవ్ర మనోవేదనకు గురైయ్యి.. పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిందట్లు స్థానికులు వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని జానకిపురం గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మయ్య అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లక్ష్మయ్య పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ నాయకుడు మెచ్చ నాగేశ్వరావు పరామర్శించి, లక్ష్మయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక జనగామ జిల్లాలో అప్పుల బాధ తాళలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు చికిత్స పొందుతున్నారు. రఘునాథపల్లి మండలం సోమయ్యకుంట తండాకు చెందిన కేతావత్ సంతోష్, సరోజ దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో భర్త మృతి చెందగా, భార్య హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.