cholesterol:కొవ్వు మంచులా కరగాలంటే.. ఇంట్లో ఉన్న పదార్థాలతో ఇలా చేయండి.!

ప్రస్తుత కాలంలో  మనం తినే ఫుడ్ వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. హార్ట్ ఎటాక్స్ అనేవి  చాలా వరకు పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండానే చాలామంది గుండె నొప్పితో మరణిస్తున్నారు.  ఇలా గుండెనొప్పి ఏజ్ తో తేడా లేకుండా రావడానికి ప్రధాన కారణం అధికంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడమే. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి ముఖ్య కారణం  మనం తినేటటువంటి మసాలా ఆయిల్ ఫుడ్స్  అని చెప్పవచ్చు. మరి మన శరీరంలో పెరిగినటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్  మంచులా కరిగిపోవాలంటే మన ఇంట్లోనే  ఈ జ్యూస్ తయారు చేసుకొని తాగితే  అద్భుతంగా పనిచేస్తుందట.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-02/1719936193_heart.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో  మనం తినే ఫుడ్ వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. హార్ట్ ఎటాక్స్ అనేవి  చాలా వరకు పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండానే చాలామంది గుండె నొప్పితో మరణిస్తున్నారు.  ఇలా గుండెనొప్పి ఏజ్ తో తేడా లేకుండా రావడానికి ప్రధాన కారణం అధికంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడమే. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి ముఖ్య కారణం  మనం తినేటటువంటి మసాలా ఆయిల్ ఫుడ్స్  అని చెప్పవచ్చు. మరి మన శరీరంలో పెరిగినటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్  మంచులా కరిగిపోవాలంటే మన ఇంట్లోనే  ఈ జ్యూస్ తయారు చేసుకొని తాగితే  అద్భుతంగా పనిచేస్తుందట.

మరి దీన్ని ఎలా తయారు చేయాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. నిమ్మకాయ, తేనె,దాల్చిన చెక్క, వెల్లుల్లి,అల్లం  వంటి పదార్థాలు తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి అందులో నిమ్మకాయ సగం కోసి ఆ సగం ముక్కను నాలుగు భాగాలుగా చేసి అందులో వేయాలి. దీని తర్వాత  ఒక అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అందులో వేసుకోవాలి.

ఆ తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు  తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేయాలి.  ఆ తర్వాత దాల్చిన చెక్క ఆ నీటిలో వేసి ఏడు నుంచి పది నిమిషాల పాటు మరిగించుకోవాలి.  అలా మరిగి మరిగి మరో కలర్ లోకి వచ్చిన తర్వాత ఆ జ్యూస్ ను గ్లాసులోకి వడగట్టుకుని అందులో అర టీ స్పూన్ తేనె కలుపుకొని ప్రతిరోజు తాగాలి. ఇలా నెలరోజుల పాటు మీరు చేశారంటే మీ శరీరంలో ఉండేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ మంచులా కరిగిపోయి గుండె జబ్బులకు దూరమవుతారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu heart-attack cholesterol junk-food home-remedy

Related Articles