ఫోన్‌పేకు బాయ్‌కాట్ సెగ తగిలింది. డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్‌పేను బాయ్‌కాట్ చేయాలని కర్ణాటకలో పలు వర్గాలు డిమాండ్ చేశాయి. కాగా, ప్రైవేటు కోటా బిల్లును ఫోన్‌పే సీఈవో, సమీర్ నిగమ్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో భారీ వర్షాలు
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఫోన్‌పేకు బాయ్‌కాట్ సెగ
ఫోన్‌పేకు బాయ్‌కాట్ సెగ తగిలింది. డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్‌పేను బాయ్‌కాట్ చేయాలని కర్ణాటకలో పలు వర్గాలు డిమాండ్ చేశాయి. కాగా, ప్రైవేటు కోటా బిల్లును ఫోన్‌పే సీఈవో, సమీర్ నిగమ్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులతో సీఎం ముఖాముఖి
కాసేపట్లో సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి ప్రారంభం కానుంది. ప్రజాభవన్‌లో రేవంత్‌రెడ్డి సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులకు ఆర్థిక సాయానికి కొత్త పథకం అమలు చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే సింగరేణి ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు.
పార్టీ ఎంపీలతో మాజీ సీఎం భేటీ
శనివారం వైసీపీ ఎంపీలతో మాజీ సీఎం జగన్ భేటీ కానున్నారు. క్యాంపు ఆఫీసులో సమావేశమై పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ సమావేశానికి వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు. పలు కీలక అంశాలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు
శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగులకు నేడు సెలవు రద్దు కానుంది. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధిక యంత్రం సూచించింది.