గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట కనకదుర్గా ఆలయం వైపు నుంచి సత్యం థియేటర్ మీదుగా ఫతేనగర్ వెళ్లే వాహనాలకు బల్కంపేట మీదుగా ప్రయాణించొద్దని ట్రాఫిక్ పోలీసులు అన్నారు. ఎస్సార్‌నగర్ టి-జంక్షన్ నుంచి ఎడమవైపు మలుపు తీసుకుని ఎస్సార్‌నగర్ కమ్యూనిటీహాల్ కూడలి నుంచి కుడి వైపు మలుపు తీసుకొని బీకేగూడ, శ్రీరామ్‌నగర్ ఎక్స్ రోడ్డు మీదుగా ఫతేనగర్ వైపు వెళ్లాలని సూచించారు.
న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ మహానగరంలో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. బల్కంపేటలోని ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకల నేపథ్యంలో ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట కనకదుర్గా ఆలయం వైపు నుంచి సత్యం థియేటర్ మీదుగా ఫతేనగర్ వెళ్లే వాహనాలకు బల్కంపేట మీదుగా ప్రయాణించొద్దని ట్రాఫిక్ పోలీసులు అన్నారు. ఎస్సార్‌నగర్ టి-జంక్షన్ నుంచి ఎడమవైపు మలుపు తీసుకుని ఎస్సార్‌నగర్ కమ్యూనిటీహాల్ కూడలి నుంచి కుడి వైపు మలుపు తీసుకొని బీకేగూడ, శ్రీరామ్‌నగర్ ఎక్స్ రోడ్డు మీదుగా ఫతేనగర్ వైపు వెళ్లాలని సూచించారు.
ఫతేనగర్ బ్రిడ్జి మీదుగా అమీర్‌పేట వైపు వెళ్లాల్సిన వాహనాలు బల్కంపేట-బేగంపేట లింకు రోడ్డు మీదుగా తాజ్ వివంతా హోటల్ నుండి యూటర్న్ తీసుకుని, గ్రీన్‌ల్యాండ్స్ మీదుగా వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ధరంకరం రోడ్డు మీదుగా వెళ్లే వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఆ మార్గాల్లో ప్రయాణించే వారు సోనాబాయి ఆలయం, సత్యం థియేటర్ నుంచి యూటర్న్ తీసుకొని ఎస్సార్‌నగర్ టీ-జంక్షన్, ఎస్సార్‌నగర్ కమ్యూనిటీహాల్, బీకేగూడ, శ్రీరామ్‌నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చెయ్యాలని పోలీసులు కోరారు.