లాల్ దర్వాజ సింహవాహిని పాతబస్తీ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో పలు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు
న్యూస్ లైన్ డెస్క్ : లాల్ దర్వాజ సింహవాహిని పాతబస్తీ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో పలు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీలోని ఫలక్ నుమా, చార్మినార్; మీర్ చౌక్, బహుదుర్పురా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రేపు, ఎల్లుండి ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
పాతబస్తీలో ఆదివారం బోనాలు, సోమవారం ఘటాల ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ అంక్షలు విధిస్తున్నట్టు సీపీ తెలిపారు. అక్కన్న మాదన్న ఆలయం నుంచి నయాపూల్ వరకు సాగే భారీ ర్యాలీలో ఏనుగు అంబారీపై అమ్మవారి ఉరేగింపు ఉంటుందన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాల్లోనే వాహనాలను పార్కు చేయాలని సూచించారు.
అలియాబాధ్ నుంచి వచ్చే టూవీలర్లు అల్కా థియేటర్, దేవి ఫ్లైవుడ్ వద్ద పార్కింగ్ చేయాలి.
హరిబౌలి, గౌలిపురా నుంచి వచ్చే వాహనాలను సుధా థియేటర్ లైన్ లో పార్కింగ్ చేసుకోవాలి.
మూసాబౌలి, మీర్ చౌక్ వైపు నుంచి వచ్చే వాహనదారులు చార్మినార్ బస్ టెర్మినల్ వద్ద వాహనాలు పార్క్ చేయాలి.
మదీనా క్రాస్ రోడ్స్, ఇంజన్ బౌలి, గుల్జార్ హౌజ్, చార్మినార్, హిమ్మత్ పురా, నాలుగుచింత రోడ్లపై వాహనాలకు అనుమతి లేదు.