KTR: గిరిజన బిడ్డలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

సంస్థ యాజమానులు రాకేష్, మురళీలు జాబ్ కాకుండా పది మందికి ఉపాధి కల్పించేలా వ్యాపారాన్ని ప్రారంభించటం మంచి విషయమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. వందలాది మంది గిరిజన బిడ్డలు పారిశ్రామికంగా ఎదిగేందుకు మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ ఈ కార్యక్రమం చేపట్టారని ఆయన గుర్తుచేశారు. వారికి అన్ని విధాలుగా సహకారం అందేందుకు ISBతో ట్రైనింగ్ కూడా ఇప్పించామని తెలిపారు. ప్రభుత్వం ద్వారా గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి వారికి అన్ని విధాలుగా సహకరించామని కేటీఆర్ వెల్లడించారు. 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-15/1721028557_modi20240715T125729.368.jpg

న్యూస్ లైన్ డెస్క్: రానున్న రోజుల్లో గిరిజన బిడ్డలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంట్రపెన్యూర్ అండ్ ఇన్నోవేషన్ (CMSTEI) పథకంలో భాగంగా రాకేష్, మురళీ అనే యువకులు డ్రాపిట్ ప్రీమియం లాండ్రీ సర్వీస్‌ను స్థాపించారు. సోమవారం ఈ లాండ్రీ సర్వీస్‌ను ప్రారంభించిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 

ఈ సంస్థ యాజమానులు రాకేష్, మురళీలు జాబ్ కాకుండా పది మందికి ఉపాధి కల్పించేలా వ్యాపారాన్ని ప్రారంభించటం మంచి విషయమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. వందలాది మంది గిరిజన బిడ్డలు పారిశ్రామికంగా ఎదిగేందుకు మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ ఈ కార్యక్రమం చేపట్టారని ఆయన గుర్తుచేశారు. వారికి అన్ని విధాలుగా సహకారం అందేందుకు ISBతో ట్రైనింగ్ కూడా ఇప్పించామని తెలిపారు. ప్రభుత్వం ద్వారా గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి వారికి అన్ని విధాలుగా సహకరించామని కేటీఆర్ వెల్లడించారు. 

డ్రాపిట్ లాండ్రీ సర్వీస్‌ను మరింత విస్తరిస్తామని చెబుతుంటే ఆనందంగా ఉందని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న BRS ప్రభుత్వం కూడా ఇదే కోరుకుందని ఆయన అన్నారు. ఇంకా చాలా మంది గిరిజన బిడ్డలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కొనసాగించి గిరిజన బిడ్డలను వ్యాపారవేత్తలుగా  తీర్చిదిద్దెందుకు సహకరించాలని కేటీఆర్ సూచించారు. ఏం పని నామోషీ కాదని.. ఎక్కడో వెళ్లి పనిచేయటం కన్నా ఇక్కడే పనిచేయాలని అన్నారు. రాకేష్, మురళికి నా వంతుగా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చారు. మీడియా కూడా ఇలాంటి పాజిటివ్ స్టోరీలు ప్రసారం చేస్తే ఎంతో మందికి స్పూర్తిగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu youth brs ktr telanganam cmstei

Related Articles