ఆదిశంకరాచార్యులు శ్రీచక్రాన్ని ప్రతిష్టించిన కారణంగా ఆలయానికి అంత ఆదాయం అమ్మవారు కల్పిస్తుందని నమ్మకం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తిరుమల శ్రీవారికి మొక్కులు ముడుపులు చెల్లించడానికి కోట్లలో జనాలు వస్తుంటారు. కాని ఎవ్వరికి తెలీదు..శ్రీవారి హుండీలు మూడు రకాలు ఉంటాయి. శ్రీవారి హుండీకి ఎందుకు అంత ధనం అంటే ఆదిశంకరాచార్యులు శ్రీచక్రాన్ని ప్రతిష్టించిన కారణంగా ఆలయానికి అంత ఆదాయం అమ్మవారు కల్పిస్తుందని నమ్మకం.
పాపాలతో నిండే కలియుగంలో ధర్మం ఓపాదంలో నడుస్తుంటుంది. కలిపురుషుడి ప్రభావంతో ప్రజలంతా అధర్మాన్నే అనుసరిస్తారు. ఈ కలియుగంలో పాపాల నుంచి శ్రీనివాసుడే కాపాడగలడు. లక్ష్మీదేవి పక్కనుండగా కుబేరుడి దగ్గర్నుంచి శ్రీనివాసుడు అప్పు ఎందుకు తీసుకున్నాడు? సాక్షాత్తు అమ్మవారికి కూడా ఇదే సందేహం వచ్చి అడిగిందట.. స్వయంగా నేనే మీ వక్ష స్థలంపై కొలువై ఉన్నాను...మనం ఎందుకు ఇన్ని యుగాలు వడ్డీ కట్టాలి అని అడిగిందట మహాలక్ష్మి దేవి.
మనిషిగా పుట్టారంటేనే కర్మలు అనుభవిస్తున్నారని అర్ధం. భగవంతుడైనా అంతే భూమి మీద పుట్టడానికి ఓ కారణం కావాలి ..కాబట్టి ఈ అప్పుకోసం పుట్టానని చెప్పారట స్వామివారు. భూమిపై అవతరించాలంటే ఏదో ఒక కర్మనో, కారణమో సృష్టించుకోవాలి..అందులో భాగమే నేను తీసుకున్న ఈ అప్పు అని వివరించాడు శ్రీ వేంకటేశ్వరుడు. ఇందుకే స్వామి వారి అప్పు ఇంకా తీరలేదని నమ్ముతారు. మీ ముడుపు..స్వామివారి వడ్డికి ఎలా జమ అవుతాయో చూద్దాం.
* నిష్కామ పుణ్యధనం
ధనాన్ని పుణ్యమార్గంలో, ఎలాంటి పాపాలు చేయకుండా సంపాదించడం..కానీ హుండీలో వేసేటప్పుడు ఎలాంటి కోర్కె లేకుండా వేస్తే దాన్ని నిష్కామ పుణ్యధనం అంటారు. ఈ ధనం స్వామి వారి అప్పు తీరుస్తుందని పండితులు నమ్ముతారు.
* పుణ్యధనం
న్యాయంగా సంపాదించిన సొమ్మే కానీ...ఏదో ఒక ప్రతి ఫలం ఆశించి వేయడం. వివాహం, సంతానం, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించి ఏవో కోర్కెలతో వేసిన ధనం. ఈ భాగాన్ని స్వామివారు అన్నదానం, విద్యాదానం, వేద పఠనాననికి ఖర్చు చేయిస్తాడట. జనాలు ఈ డబ్బును స్వామివారి ధనంగా భావించి వేసిన వారి పాపాన్ని పోగొడుతుంది.
* అన్యాయపు సొమ్ము
ఆ సొమ్మునే హుండీలో వేస్తారు. అయితే స్వామివారు ఆస్తులు దోచేసేవారు తరతరాలుగా ఆ పాపాన్ని అనుభవించి తీరుతారు. వంశం నాశనం అయిపోతుందంటారు. స్వామివారికి పాపపు సొమ్ములో భాగం ఇస్తే ఇది ఎప్పటికి వారి పాపాన్ని తొలగించలేదు. కాని స్వామి వారు ఈ పాపాన్ని ఇంకా మూట కట్టుకుంటారని ప్రతీతి.
తిరుమల హుండీలో మొదటి రెండు మార్గాల్లో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడి సేవలో వినియోగం అవుతుందంటారు పండితులు..అయితే మీ పాపాలను బట్టి స్వామి వారే లెక్కలు వేస్తారట. మీ ఎలా సంపాదించారో దానిని బట్టే డబ్బు ఎలా వినియోగిస్తున్నారనేది మ్యాటర్.