అధికారులు పని తీరు మార్చుకోవాలని సూచించారు. ఇవాళ తుమ్మల వెళ్తే కూడా సేమ్ సీన్. శాఖలు వేరైనా ప్రభుత్వ ఉద్యోగుల్లో మాత్రం మార్పు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్ష్యాత్తు సెక్రటేరియట్ లోనే పరిస్థితి ఇలా ఉండటం ఉద్యోగుల నిర్లక్ష్యానికి నిదర్శనమంటున్నారు. జిల్లాలు, మండలాల్లో అయితే మరింత అద్వాన్నంగా ఉన్నాయని జనం మండిపడుతున్నారన్నారు. నిత్యం పరిశీలించే అధికారులు లేక ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వస్తున్నారని చెబుతున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: అగ్రికల్చర్ డిపార్టుమెంట్ ఆఫీసులో ఆకస్మికంగా తనిఖీ చేశారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. గురువారం ఉదయం సెక్రటేరియట్‌లో ఉన్న ఆఫీసుకు వెళ్లారు. అయితే అక్కడ సిబ్బంది పూర్తిస్థాయిలో ఇంకా రాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమయం దాటి పోయినా చాలా మంది ఉద్యోగులు ఎందుకు రాలేదని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఇంత నిర్లక్ష్యంగా పని చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఆలస్యంగా వస్తే కుదరదన్నారు. రేపట్నుంచి అందరూ సమయానికి రావాలని, సమయం అయిపోయే వరకు ఉండాలని ఆదేశించారు. ఎవరైనా ఆలస్యంగా వచ్చినా, ముందు వెళ్లిపోయినా శాఖపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అగ్రికల్చర్ డైరెక్టర్ ను ఆదేశించారు మంత్రి తుమ్మల.
ఆఫీస్ ఖాళీ.. తుమ్మల షాక్..! pic.twitter.com/VkBKI1xbJU — News Line Telugu (@NewsLineTelugu) July 4, 2024
బుధవారం రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం తన శాఖకు సంబంధించిన ఆఫీసులో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అప్పుడు కూడా చాలా మంది ఉద్యోగులు ఇంకా డ్యూటీకి రాలేదు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పని తీరు మార్చుకోవాలని సూచించారు. ఇవాళ తుమ్మల వెళ్తే కూడా సేమ్ సీన్. శాఖలు వేరైనా ప్రభుత్వ ఉద్యోగుల్లో మాత్రం మార్పు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్ష్యాత్తు సెక్రటేరియట్ లోనే పరిస్థితి ఇలా ఉండటం ఉద్యోగుల నిర్లక్ష్యానికి నిదర్శనమంటున్నారు. జిల్లాలు, మండలాల్లో అయితే మరింత అద్వాన్నంగా ఉన్నాయని జనం మండిపడుతున్నారన్నారు. నిత్యం పరిశీలించే అధికారులు లేక ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వస్తున్నారని చెబుతున్నారు.