సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి భేటీపై జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో వెంట్రామిరెడ్డితో పాటు అతని అనుచరుడు ఎమ్మెల్సీ విజేయుడితో కలిసి పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించే ఆయన రేవంత్‌ను కలిశారని సమాచారం. త్వరలో సీఎం మహబూబ్ నగర్ పర్యటనలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది.
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. పలువురు నాయకులు అధికార పార్టీలో చేరుతున్నారు. ఈ ఇప్పటికే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా అధికార పార్టీలోకి వెళ్లారు. మరోవైపు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఉదయం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే ఈ అంశంపై సంబంధిత నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నెట్టెంపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని సీఎంను కోరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయన ఓ వినతి పత్రం అందజేసినట్లుగా సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి భేటీపై జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో వెంట్రామిరెడ్డితో పాటు అతని అనుచరుడు ఎమ్మెల్సీ విజేయుడితో కలిసి పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించే ఆయన రేవంత్‌ను కలిశారని సమాచారం. త్వరలో సీఎం మహబూబ్ నగర్ పర్యటనలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. కొంత కాలంగా ఎమ్మెల్యే విజేయుడు పార్టీ మారనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు ఆయన దీన్ని ఖండించలేదు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సీఎంతో భేటీ కావడంతో రాజకీయం జోరుగా చర్చలు జరుగుతున్నాయి.