ఉత్తరాఖండ్ లోని రోషనాబాద్ జైలులో ‘రామాయణం’నాటకం ఆడారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా ఖైదీలంతా ఈ నాటకం ఆడడం మొదలుపెట్టారు. ఆడుతూ పారిపోయినట్లు తెలుస్తుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రామాయణం స్కిట్ ఎప్పుడు కాలేజీల్లో ...వేయడం ..సూపర్ డూపర్ కామెడీ పండించడం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. కాని రీసెంట్ గా ఉత్తరాఖండ్ జైల్లో రామాయణం నాటకం వేశారు. చివరికి పోలీసులకు ట్విస్ట్ కూడా ఇచ్చారు. దెబ్బకి అప్పటి వరకు నవ్వులు విసురుతూ రిలాక్స్ అయిన పోలీసులకు మూడు చెరువుల నీళ్లు తాగించారు.
ఉత్తరాఖండ్ లోని రోషనాబాద్ జైలులో ‘రామాయణం’నాటకం ఆడారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా ఖైదీలంతా ఈ నాటకం ఆడడం మొదలుపెట్టారు. ఆడుతూ పారిపోయినట్లు తెలుస్తుంది. విజయదశమి సందర్భంగా జైలులో ఖైదీలతో రామాయణం నాటకం ఏర్పాటు చేశారు జైలు అధికారులు. నాటకం చాలా ఇంట్రస్టింగ్ గా నడుస్తున్నపుడు పోలీసులు రిలాక్స్ అయ్యే టైంలో ఈ పక్కా స్కెచ్ వేశారు. ఇద్దరు ఖైదీలు పంకజ్, రాజ్ కుమార్ వానర పాత్రలు వేశారు. పోలీస్ అధికారుల, ఖైదీలో నాటకాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
నాటకం మధ్యలో ఇద్దరు ఖైదీలు సీతను వెతికే క్రమంలో 20 అడుగుల జైలు గోడపై నుంచి దూకి పరారయ్యారు. కోతి గెంతులు వేస్తూ ఎలా అయితే వెళ్తుందో అలా 20 అడుగుల గోడ దూకేశాడు ఖైదీ. అసలు విషయం అర్ధమయ్యే లోపే ...ఖైదీలు పరారయ్యారు. ఇక చూస్కో పోలీసులు కంగారు.పంకజ్ ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తుండగా, రాజ్ కుమార్ కిడ్నాప్ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.