తమ సమస్యలకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రసారం చేయడం లేదని ఇప్పటికే నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీడియాను కూడా గాంధీ హాస్పిటల్‌లోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: తమ సమస్యలను ప్రభుత్వం(Government) పట్టించుకోవడం లేదని గత కొంత కాలంగా నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్(congress) ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్(job calendar) రిలీజ్ చేస్తామన్న హామీని కూడా అమలు చేయాలని నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు అన్నీ ఒకదాని తర్వాత మరొకటి ఉండడంతో తమ మీద ఒత్తిడి పెడుతున్నట్లే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రూప్స్ అభ్యర్థులు(groups aspirants), నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రి(Gandhi hospital)లో విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్(Motilal Nayak) ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. అయితే, ఆయనకు మద్దతుగా ఆందోళన చేపడుతున్న నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
తమ సమస్యలకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రసారం చేయడం లేదని ఇప్పటికే నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీడియాను కూడా గాంధీ హాస్పిటల్‌లోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలంటూ గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్ ఎంట్రన్స్‌ను మూసివేశారు. దీంతో ప్రయాణికులు స్టేషన్ బయటనే వేచిచూస్తున్నారు. మరోవైపు నిరుద్యోగులను అడ్డుకునేందుకు గాంధీ హాస్పిటల్‌తో పాటు మెట్రో స్టేషన్ వద్ద భారీగా పొలిసు బలగాలు మోహరించాయి.