పెద్ద స్థాయిలో నిరసనలు ఆందోళనలు జరిగినప్పటికీ పలు మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు తమ సమస్యలను చూపించలేదని నిరుద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. NTV, TV5, ఈనాడు, V6, ABN వంటి ఛానళ్లు తమ సమస్యలను ప్రచారం చేయడంలేదని మండిపడ్డారు. ఈ ఛానెళ్లన్నీ ఫోర్త్ ఎస్టేట్ లాగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. తమ ఆందోళనలు, సమస్యలను సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ చానెళ్లు మాత్రమే చుపించాయని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫోర్త్ ఎస్టేట్ లాగా పని చేయడంలేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గత కొంత కాలంగా నిరుద్యోగులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్న హామీని కూడా అమలు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు.
గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలని, గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, తమ డిమాండ్ల సాధన కోసం విద్యార్థి సంఘం నాయకుడు మోతిలాల్ 9 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో నిరాహార దీక్షను విరమించి TGSPSC ముట్టడికి పిలుపునిచ్చారు. నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు, BRSV కార్యకర్తలు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో పాటు BRSకు చెందిన పలువురు కీలక నేతలు కూడా నిరుద్యోగులకు మద్దతు తెలిపేందుకు TGSPSC వద్దకు వెళ్లారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, పెద్ద స్థాయిలో నిరసనలు, ఆందోళనలు జరిగినప్పటికీ పలు మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు తమ సమస్యలను చూపించలేదని నిరుద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. NTV, TV5, ఈనాడు, V6, ABN వంటి ఛానళ్లు తమ సమస్యలను ప్రచారం చేయడం లేదని మండిపడ్డారు. ఈ ఛానెళ్లన్నీ ఫోర్త్ ఎస్టేట్ లాగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. తమ ఆందోళనలు, సమస్యలను సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ చానెళ్లు మాత్రమే చుపించాయని అన్నారు.
మీడియా పై తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం pic.twitter.com/h7FcrzfPL7 — News Line Telugu (@NewsLineTelugu) July 7, 2024
తమ సమస్యలను చూపించినందుకు పలు యూట్యూబ్ ఛానెళ్లతో పాటు సోషల్ మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ నిరుద్యోగులు ఓ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియా అనేదే లేకపోతే నిరుద్యోగుల బాధలు ప్రజలకు తెలిసేవి కాదని అన్నారు. ప్రభుత్వం ఎలాంటిదైనా మీడియా వ్యవస్థ నిజాయితీగా ఉంటే సమాజం బాగుపడుతుందని నిరుద్యోగులు అన్నారు.