Upasana: ఇదేం ఇండిపెండెన్స్ డే ..భారతీయులు సిగ్గుపడాల్సిన రోజు

ఇదేం స్వాతంత్య్ర దినోత్సవం" అంటూ తీవ్రంగా మండి పడ్డారు. ఓ మహిళకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటే గుండె పగిలిపోతోందని అన్నారు.


Published Aug 15, 2024 12:31:00 PM
postImages/2024-08-15/1723705362_upasanathumb167818873343316781887435061678188743506.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: భారతీయులు పండుగ చేసుకుంటున్నారు. కాని ఇదేం స్వత్రంత్యదినోత్సవం..ఈ రోజు భారతీయులంతా సిగ్గుపడాల్సిన రోజు. 78 ఏళ్ల సంపూర్ణ భారతదేశంలో మహిళలకు ఇంకా రక్షణ కల్పించలేకపోతున్నామంటున్నారు ఉపాసన. కోలకత్తాలో ట్రైనీ డాక్టర్ గ్యాంగ్ రేప్ ఘటన మరోసారి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వివరాలు చూస్తే భయమేస్తుంది. దారుణంగా హింసించి చంపేశారు.


శరీరంలో నుంచి సేకరించిన నమూనాలు కొన్ని ఈ అనుమానాలకు తావిచ్చాయి. ఈ ఘటనపై దేశమంతా నినదిస్తూనే ఉంది. నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు ఈ ఘటన పై రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా రియాక్ట్ అయ్యారు. "ఇదేం స్వాతంత్య్ర దినోత్సవం" అంటూ తీవ్రంగా మండి పడ్డారు. ఓ మహిళకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటే గుండె పగిలిపోతోందని అన్నారు. "ఆమె జీవితానికి విలువే లేదా" అని ప్రశ్నించారు. ఇంత ఘోరం చూశాక కూడా మనం ఈ వేడుక చేసుకోవడంలో అర్ధం లేదని తెలిపారు.


మన దేశంలో హెల్త్‌ కేర్‌ రంగానికి మహిళలే వెన్నెముక. ఈ రంగంలో 50% వాటా వాళ్లదే. వీళ్లంతా పేషెంట్స్‌తోనే ఎక్కువ సమయం గడుపుతారు. వాళ్ల సేవలు ఖచ్చితంగా మనకు 24 గంటలు కావాలి. సమాజంలో డాక్టర్లకే రక్షణ లేదంటే ఇక ఏ రంగంలో ఆడవారికి లేనట్టే. ప్రతి ఒక్కరికి గౌరవం కావాలి. ఈ ఘటనపై ఉపాసన అభిప్రాయం కరెక్టే అంటున్నారు నెటిజన్లు. ఎప్పటికి మారని ఈ అరచకాలను వదిలి మన దేశ గొప్ప దేశం అని చెప్పుకోవడంలో అర్ధం లేదంటున్నారు నెటిజన్లు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu doctors student-murdered upasana

Related Articles