వైసీపీ నాయకులపై కావాలనే బురదజల్లుతున్నారని ఆయన అన్నారు. తమపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళకు ద్రోహం చేశానని దుష్ప్రచారం చేస్తున్నారని, తన పేరు, ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుష్ప్రచారం చేస్తున్న వారు ఎంతటివారైనా వదిలిపెట్టమని అన్నారు. తాటాకు చప్పుళ్లకు తాను భయపడేది లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: మీద నిరాధారమైన ఆరోపణలు చేసిన మీడియన్ ఛానళ్లపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సోమవరం మీడియాతో మాట్లాడిన ఆయన పలు టీవీ ఛానళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఆదివాసీ మహిళతో తనకు సంబంధం ఉన్నట్లుగా టీవీ 5 సాంబ, మహా న్యూస్, ఆంధ్రజ్యోతి వంటి ఛానళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని ఆయన మండిపడ్డారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీ నాయకులపై కావాలనే బురదజల్లుతున్నారని ఆయన అన్నారు. తమపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళకు ద్రోహం చేశానని దుష్ప్రచారం చేస్తున్నారని, తన పేరు, ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుష్ప్రచారం చేస్తున్న వారు ఎంతటివారైనా వదిలిపెట్టమని అన్నారు. తాటాకు చప్పుళ్లకు తాను భయపడేది లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నామని వెనక్కి తగ్గేదిలేదని, మధ్యంతర ఎన్నికలు జరిగినా వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తాం..తోకలు కట్ చేస్తామని వ్యాఖ్యానించారు. చట్టపరంగా ముందుకువెళతామని, మహిళా కమిషన్ సహా అన్ని కమిషన్లకూ ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.