న్యూస్ లైన్, హైదరాబాద్: రెజ్లర్ వినేష్ పోగట్ పై అనర్హత వేటు వేయడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. సెమీస్ లో కరెక్ట్ గా ఉన్న వినేష్ ఫైనల్ కు వచ్చే వరకు బరువు పెరగడం ఏంటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
న్యూస్ లైన్, హైదరాబాద్: రెజ్లర్ వినేష్ పోగట్ పై అనర్హత వేటు వేయడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. సెమీస్ లో కరెక్ట్ గా ఉన్న వినేష్ ఫైనల్ కు వచ్చే వరకు బరువు పెరగడం ఏంటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా కుట్ర చేశారా అని యావత్ దేశం మొత్తం అనుమానాలు వ్యక్తం వస్తోంది. అటూ పలువురు క్రీడా కారులు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాములుగా 100 గ్రాముల వెయిట్ పెరగడం అనేది చాలా చిన్న విషయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వినేష్ పోగట్ పై అనర్హత వేటు వేయడంపై పార్లమెంట్ లోనూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై కేంద్ర మంత్రి స్పందించాలని పట్టుపట్టారు. ఒలింపిక్స్ ను బహిష్కరించాలంటూ ఆప్ ఎంపీలు డిమాండ్ చేశారు. అనర్హత వేటుపై భారత ఒలింపిక్స్ అధ్యక్షురాలు పీటీ ఊషతో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. ఏం జరిగిందని,..? ఏం చేయవచ్చని అడిగి తెలుసుకున్నారు. వినేష్ పోగట్ కు జరిగిన అన్యాయంపై నిరసన తెలపాలని సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు మధ్యాహ్నం పార్లమెంట్ లో కేంద్ర మంత్రి ప్రకటన చేయనున్నారు.