Vinod Kumar: వాళ్లు పార్టీ మారినా పోయేదేమీ లేదు

ఏపీ విభజన చట్టంలోని అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు మోడీతో ఇటీవల ఢిల్లీ వెళ్లిన సమయంలో మాట్లాడారని తెలిపారు. విభజన చట్టం షెడ్యూల్ 13లో ఉన్న పెట్రో కెమికల్, ఆయిల్ రిఫైనరీ హబ్ ఏపీకి కేంద్రం ఇస్తున్నట్లుగా ఓ ప్రముఖ పత్రికలో వార్త వచ్చిందని ఆయన వెల్లడించారు.  ఇదే షెడ్యూల్ 13 లో తెలంగాణకు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కూడా ఉందని గుర్తుచేశారు. 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-13/1720861967_Untitleddesign10.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఇటీవల BRSకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా, ఈ అంశంపై BRS నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి కోసమే BRSలో చేరుతున్నామని పార్టీ మారిన వారు అప్పుడు చెప్పారు. ఇప్పుడు మళ్లీ అదే చెప్తూ.. కాంగ్రెస్ పార్టీలో చేరారని వినోద్ కుమార్ వెల్లడించారు.  అలంటి వారు ఇతర పార్టీల్లోకి వెళ్లినా పోయేదేమీ లేదని అన్నారు. 


బీజేపీకి కేంద్రంలో స్వంతంగా మెజారిటీ రాలేదని ఆయన తెలిపారు. టీడీపీ, జేడీయూ తదితర పార్టీల మద్దతుతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు మోడీతో ఇటీవల ఢిల్లీ వెళ్లిన సమయంలో మాట్లాడారని తెలిపారు. విభజన చట్టం షెడ్యూల్ 13లో ఉన్న పెట్రో కెమికల్, ఆయిల్ రిఫైనరీ హబ్ ఏపీకి కేంద్రం ఇస్తున్నట్లుగా ఓ ప్రముఖ పత్రికలో వార్త వచ్చిందని ఆయన వెల్లడించారు.  ఇదే షెడ్యూల్ 13 లో తెలంగాణకు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కూడా ఉందని గుర్తుచేశారు. 


పదేళ్లుగా అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదని వినోద్ కుమార్ మండిపడ్డారు. ఏపీలో పెట్రో కెమికల్స్ రిఫైనరీ ఏర్పాటుకు BRS వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సినవి కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ నుంచి బీజేపీ తరపున ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు. అయినప్పటికీ  బీజేపీ తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపిస్తోందని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఐటీఐఆర్ ఇవ్వలేదని తెలిపారు. కేసీఆర్ కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తే ఒక్క నవోదయ విద్యాలయం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


తెలంగాణకు కేంద్ర క్యాబినెట్ మంత్రి, సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చంద్రబాబుపై కేంద్రం ఆధారపడింది కాబట్టే పెట్రో కెమికల్ హబ్ ఇస్తున్నారని తెలిపారు. ఇక్కడ తెలంగాణపై ఆధారపడలేదు కాబట్టే ఏమీ ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాటం జరుగుతోందని తెలిపారు. మోడీకి స్వంతంగా సీట్లు వచ్చి వుంటే ఏపీకి ఏమీ ఇచ్చే వాళ్లుకాదని అన్నారు. ఏపీలో ప్రాంతీయ పార్టీ గెలిచింది కాబట్టే చంద్రబాబు అడిగినవి అన్నీ ఇస్తున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు. 

newsline-whatsapp-channel
Tags : telangana newslinetelugu brs congress telanganam vinod-kumar

Related Articles