కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమగ్ర కులగణనతోపాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కేటాయింపు జరిగిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్ హామీని సర్కార్ నెరవేర్చాలని BRS నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. గాంధీ హాస్పిటల్‌లో అమరణ నిరాహార దీక్ష చేస్తున్న హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వరులు, ఆజాది యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కలి సంజయ్ లను ఆయన శనివారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అయన.. ఆమరణ నిరాహార దీక్షపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని ఆయన అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమగ్ర కులగణనతోపాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కేటాయింపు జరిగిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీసీలను మోసం చేసి పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన అన్నారు. వెంటనే సమగ్ర కుల గణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వారికి ఏదైనా అయితే, దాని ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయనడిమాండ్ చేశారు.